ప్రధాని మోదీ రేపు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ‘స్వస్త్ నారీ ససక్త పరివార్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలాగే రేపు తన 75వ పుట్టినరోజు సందర్భంగా అక్కడే ఆ రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తల మధ్య జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు.