E.G: కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద సహిత విద్య విభాగం కార్యక్రమంలో భాగంగా మెడికల్ అసెస్మెంట్ క్యాంపు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవ్వూరు మండలంలో అర్హులైన విద్యార్థులకు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల కుర్చీలు తదితర వాటిని పంపిణీ చేశారు.