చియా సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా 3, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఎముకలు దృఢంగా మారుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.