ATP: రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో వెలసిన దశబుజ మహాగణపతిని మంగళవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు దర్శించుకున్నారు. పురోహితులు ఆయనకు వేదమంత్రోచరణ నడుమ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాయదుర్గంను పురాతన దేవాలయాల పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.