NLR: కావలి గ్రామ దేవత శ్రీ కలుగోళ శాంభవి దేవి దేవస్థానం నందు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.