ELR: ఏలూరులోని పోణంగి డంపింగ్ యార్డును మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ బుధవారం పరిశీలించారు. అభివృద్ధి పనులు, వ్యర్థాల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.