కాకినాడ నగరంలో మంగళవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 55 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. వీరిని బుధవారం కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ షరీన్ ఐదుగురికి 5 రోజులు, 17 మందికి 2 రోజులు జైలు శిక్ష విధించారని ట్రాఫిక్ సీఐ నూని రమేశ్ తెలిపారు. మిగిలిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు.