MHBD: లంబాడ సామాజిక వర్గానికి చెందిన నేతలు శుక్రవారం HYDలో లంబాడీల ఆత్మగౌరవసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు లంబాడా మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీ కవిత, మాజీ MLA శంకర్ నాయక్ ఉన్నారు.