ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలో కుక్కల బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రతి వీధిలో కుక్కలు ఉండటం, రాత్రుల సమయంలో కుక్కలు మనుషుల మీదకు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, బాదంపూడి, తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఆయా గ్రామ ప్రజలు అంటున్నారు.