నెల్లూరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రమాదం తనను కలచివేసిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు