ADB: పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓజోన్ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, అధ్యాపకులు ఉన్నారు.