NZB: హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టీ) బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు.