WGL: నర్సంపేట మండలం కేంద్రంలో ఇవాళ BJP నేతల ఆధ్వర్యంలో బీజేపీ సేవా పక్షం కార్యశాల నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించాలని కార్యకర్తలకు సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాల పై సూచనలు చేశారు.