కృష్ణా: 15 నెలలుగా కూటమి పాలనలో పామర్రులో అవినీతి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. పామర్రు నియోజకవర్గంలో మొన్నటిదాకా రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతూ, గ్రామానికి ఒక ఏజెంట్ని పెట్టుకుని సాయంత్రానికి డబ్బులు వసూలు చేస్తున్నారని మంగళవారం ఆయన విమర్శించారు.