SRCL: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం వీడియో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్న నిజాం సొంత ఇస్లామిక్ దేశంగా ఉండాలని భావించాడన్నారు.