వినియోగదారులకు మదర్ డైరీ గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్‌పై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కేంద్రం సవరించిన GST వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అలాగే పనీర్, చీజ్, నెయ్యి, ఐస్ క్రీమ్ వంటి ఇతర ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి.