BDK: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన జోనల్ స్థాయి క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తితో ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థి దశలోనే క్రీడలు కూడా చాలా అవసరమని అన్నారు. రాబోయే రోజుల్లో విద్య క్రీడల్లో పథకాలు సాధించాలని సూచించారు.