AP: లిక్కర్ కేసులో సిట్ మూడో అదనపు ఛార్జ్ షీట్‌ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. 86 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్లో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ బాలాజీ యాదవ్ పాత్రలపై సిట్ ప్రధానంగా ప్రస్తావించింది. కేసు విచారణలో భాగంగా సేకరించిన కీలక ఆధారాలు, సాక్ష్యాలను ఇందులో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.