TG: ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉన్నత విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ రమేష్ బాబు తెలిపారు. ఈ వారంలో రూ.600 కోట్లు, దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.