BHNG: వక్ఫ్ సవరణ బిల్లులోని కొన్ని అభ్యంతరకర అంశాలపై సుప్రీం కోర్ట్ స్టే విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, భువనగిరి ముస్లిం జేఏసీ ఫౌండర్ మహమ్మద్ అతహర్ స్వాగతించారు. గత 6 నెలల క్రితం కేంద్రంలోని BJP ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వక్ఫ్ చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించిందని, దీనిని ఇండియా కూటమిలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని అన్నారు.