ఆసియ కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ 42 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన UAE 172 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ఒమన్ 18.4 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. UAE బౌలరల్లో జునైద్ సిద్ధిక్ 4 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే, అలీ, జవాదుల్లా తలో 2 వికెట్లు తీసుకున్నారు. వరుసగా 2 ఓటములతో ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.