విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పద్మారాధన మంగళవారం వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ప్రత్యేక సేవలో ఉభయ దాతలు పాల్గొని అమ్మవారి కటాక్షం కోసం ప్రార్థనలు చేశారు. వేదపండితులు, అర్చకులు మంత్రోచ్ఛారణలతో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా, ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయం అందించారు.