KNR: పత్తి పంట సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 44 వేల 885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5 లక్షల 38 వేల 620 క్వింటాల పత్తి దిగుబడి వచ్చే ఆవకాశం ఉన్నట్లు తెలిపారు.