ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఓడితే టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఆఫ్ఘాన్‌కు చావో రేవో లాగా మారింది. ఈ మ్యాచ్‌తో గ్రూప్-B నుంచి సూపర్-4 చేరే రెండు జట్లు ఏవో తెలిపోనుంది.