కోనసీమ: తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి దేవస్థాన ఛైర్మెన్‌గా ముదునూరి వెంకటరాజు(గబ్బర్ సింగ్) నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్రేయపురానికి చెందిన ఈయన మొదటి నుంచి టీడీపీకి సేవలందిస్తూ వస్తున్నారు. ఈ పదవి దక్కినందుకు పలువురు పార్టీ శ్రేణులు వెంకట రాజుకు అభినందనలు తెలిపారు.