GDWL: సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తోందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. మానవపాడు మండలం, చెన్నిపాడు గ్రామానికి చెందిన జయమ్మకు మంజూరైన రూ.12,000 చెక్కును గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.