HYD: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో మూసీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో మూసారాం బ్రిడ్జి వద్ద నీరు పొంగి ప్రవహిస్తుంది. దీంతో బ్రిడ్జిని పోలీసులు మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని పోలీసులు కోరుతున్నారు.