హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’ ఊహించని విజయం అందుకుంది. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రేపటి నుంచి తెలుగుతో పాటు పలు భాషల్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది.