BDK: సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై సిహెచ్. వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆళ్లపల్లి మండలంలోని ప్రజలు, యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. మండలంలో ఎవరూ గంజాయి పంట పండించొద్దని, రవాణా చేయొద్దని హెచ్చరించారు.