MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. చింతగూడ పీఏసీఎస్ పరిధిలో ఉన్న తపాలాపూర్, తిమ్మాపూర్, రాంపూర్, సింగరాయిపేట్ గ్రామాల రైతులు యూరియా బస్తాల కోసం తిమ్మాపూర్ రైతు వేదిక వద్ద నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే యూరియా బస్తాలు రాకపోవడంతో రైతులు నిరాశగా వెళ్ళిపోతున్నారు.