SDPT: భారతదేశంలో విలీనమై 78వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా, గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు, తెలంగాణ స్వతంత్ర స్ఫూర్తిని చాటిచెప్పే అద్భుతమైన చిత్రాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ చిత్రం తెలంగాణను ‘కోటి రత్నాల వీణ’గా అభివర్ణిస్తూ, పావురం స్వేచ్ఛకు, పిడికిలి పోరాట పటిమకు చిహ్నాలని రామరాజు వేశారు.