శ్రీకాకుళం కలెక్టరేట్లో ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్రావు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలతో వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సృష్టికర్త బ్రహ్మకు ప్రతిరూపమైన దేవశిల్పి విశ్వకర్మ అని కొనియాడారు. ఆయన జయంతోత్సవాలను కలెక్టరేట్లో నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.