BHNG: భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇవాళ స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మెగా హెల్త్ క్యాంపు ప్రారంభోత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మెగా హెల్త్ క్యాంపును అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.