WGL: వరంగల్ ఓ సిటీ IDOC మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ అతిధిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మట్లాడుతూ.. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.