KDP: ప్రొద్దుటూరు మెప్మా విభాగంలో అవినీతి అనకొండ టీఈ మహాలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారు మునిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. టీఈ మహాలక్ష్మి డ్వాక్రా ఆర్పీలు, సీవోలకు టార్గెట్లు పెట్టి ఆదాయం పొందుతున్నారన్నారు. అనంతరం నాసిరకం ఉత్పత్తులను కొనుగోలు చేయించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారన్నారు.