NZB: నగరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మూడోసారి ప్రధానిగా సేవలందిస్తున్న మోదీ ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.