KMM: తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబు, రజాకార్లను తరిమికొట్టింది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ సమితి సభ్యులు హేమంతరావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా పరిషత్ హాలులో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ పోరాట చరిత్రను నేటి విద్యార్థులకు తెలియజేసేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.