W.G: పెనుమంట్ర మండలం ఎస్.ఇల్లిందలపర్రులో నిన్న రాత్రి గుర్తు తెలియని దొంగలు బ్రహ్మానంద రెడ్డి ఇంట్లోకి చొరబడి, ఇంట్లోని వారిని భయపెట్టి, బంగారు వస్తువులు, నగదు, రెండు ఫోన్లను దొంగిలించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు. నేరస్థులను పట్టుకోవడానికి పోలీస్ జాగిలాలను కూడా రప్పించారు.