నంద్యాల: టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా విజయ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం టైగర్ ప్రాజెక్ట్ కార్యాలయంలో విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశానుసారం టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తానని వెల్లడించారు.