ATP: కళ్యాణదుర్గంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కూటమి నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఎవరికీ తలవంచని ధీరుడు, ప్రపంచ దేశాలు గర్వించదగిన నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.