కృష్ణా: చల్లపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి మాట్లాడుతూ.. మహిళలు పోషకాహారంపై శ్రద్ధ వహించాలన్నారు. సుపోషిత్ భారత్, సక్షం భారత్ కార్యక్రమం లక్ష్యాలు వివరించారు. ఈవో మాధవేంద్రరావు, సీడీపీవో, సూపర్ వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.