BHNG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్ అన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు. ఇవాళ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా CPI జిల్లా కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.