VKB: పెద్దేముల్ మండల ఎస్సై వేణు కుమార్, తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్ బుధవారం దాతల సహాయంతో మండలంలోని పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయించారు. ముఖ్యంగా పెద్దేముల్ నుంచి తాండూర్ వెళ్లే రహదారిలో ఉన్న గుంతలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఆ గుంతలను కంకర వేసి పూడ్చారు. అందుకు ఆజంఖాన్, ప్రకాష్ రెడ్డి, గౌస్ సహకారం అందించారు.