NTR: విజయవాడలో భారీ వర్షం కురున్తుంది. రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో విజయవాడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.