RR: ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ భర్త మోహన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రేణుక కుటుంబం రోడ్డుపై పడింది. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను వివరించగా.. రూ.4 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో నందిగామ మాజీ ఎంపీటీసీ చంద్రపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.