GNTR: వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి శివశంకర్ మాట్లాడుతూ.. గాలికుంటు ఒక తీవ్రమైన వైరల్ వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో అధిక జ్వరం, నోటిలో బొబ్బలు, పుండ్లు, లాలాజలం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు.