అన్నమయ్య: మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష ఇవాళ విజయవాడ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనతో పాటు టౌన్ బ్యాంక్ ఛైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ నాయుడు, పూల మురళి, సోమ శేఖర్, తదితరులు ఉన్నారు. ఇందులో బాగంగా మంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం మదనపల్లె టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.