భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియాకప్లో UAE, పాక్ జట్లపై మొత్తం 7 వికెట్లు తీసి 2 మ్యాచుల్లోనూ POTM అవార్డ్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా తన సత్తా చూపడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశాడు. అవకాశాలు రానప్పుడు ఇతరులను నిందించడం సులువే కానీ అది తనకు ఇష్టం లేదన్నాడు. పరిస్థితులు అర్థంచేసుకొని నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ముందుకెళ్లాలని సూచించాడు.