ADB: పౌష్టికాహారంతోనే రోగాలను దూరం చేయవచ్చునని డాక్టర్ నిఖిల్ రాజ్ తెలిపారు. బుధవారం బీంపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోస్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో డాక్టర్ శోయబోద్దిన్ ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ప్రతిరోజు తినే ఆహార పదార్థాలలో నూనె, చక్కెర వంటి పదార్థాలను తగ్గించుకోవాలని సూచించారు.