KMM: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.